నిశీధి నియంతను నేను!!
నిశీధి నియంతను నేను,
కానరాని అందాలను ఆస్వాదిస్తుంటాను.
అనేక పార్శ్వాలున్న
అద్వైతుడ నేను, నిశాచారిధిత్యులలో వెలుగు రేఖలు నింపుతుంటాను.
అనంతంలో సూక్ష్మాన్ని
నేను, అంధకార బ్రహ్మాండములో జీవ ఛాయలు అన్వేషిస్తుంటాను.
కధనరంగపు మారణకాండలో
శాంతి కపోతం నేను, వెచ్చటి నెత్తురు ఛాయతో చిరునవ్వు చిందిస్తుంటాను.
భావవేశాలున్న స్థితి
ప్రజ్ఞుడ నేను, కష్టాల కడలిలో సుఖాలామ్రుతాన్ని మదిస్తుంటాను.
అకారణం తో జనించిన
జీవాత్మ నేను, ఆ కారణానికి కారణమైన పరమాత్మను వేదుకుతుంటాను.
సృష్టికి ప్రతి సృష్టి
చేయగల నైజం నేను, కాని దాని చేతనే సృష్టించబడి, స్థితించబడి, లయించ బడుచున్నాను.
నేనే మానవుడను,
సమానవుడను, అసమానవుడను.......
రచన: 01-08-2014
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ –స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్
ల్యాబ్ – నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB-
Nizamabad
94404 76854
No comments:
Post a Comment