Thursday, 25 September 2014

నా మొదటి పది తూటాలు...4) తెలుగు ఎప్పటికి వెలుగు


తెలుగు ఎప్పటికి వెలుగు
ఇది 56 అక్షరాల భాష మాత్రమేనా? అన్న తలంపు నన్ను తట్టి లేపింది.
కాదు ఇది 56 లక్షల భావాలకు అతీతమైనదన్న సమాధానం నన్ను శాతింపజేసింది.

ఇది పరాయీ భాషకన్నా తక్కువా? అన్న సందేహం నన్ను కలిచివేసింది.
కాదు ప్రతీ భాష కన్నా ఇదే గొప్ప అన్న నివృత్తి నన్ను హాయీ నిద్రపుచ్చింది.

ఇది జవసత్వాలు నింపలేని సాధారణభాషా? అన్న ప్రశ్న నా కళ్ళలో నీళ్ళు నింపింది.
కాదు ఇది నవసమాజాన్ని నిర్మించిన అసాధారణ భాష అన్న జవాబు నా కళ్ళలో ఆనంద భాష్పాలు నింపింది.

ఇది షేక్స్పియర్ చదువని దురదృష్ట భాషా? అన్న భావన నన్ను కాస్త కలవరానికి గురి చేసింది.
కాదు ఇది శ్రీ శ్రీ అద్దిన మహోన్నత భాష అన్న నిజం నా గుండెలో సగర్వాన్ని నింపింది.

ఇది కార్పోరేట్ జీతం ఇవ్వలేని పనికిమాలిన భాషా? అన్న సంకోచం నాలో ఆక్రోశాన్ని నింపింది.
కాదు ఇది కుటుంబ విలువలు నేర్పే సుమధుర భాష అన్న ఎరుక నన్ను విజేతగా నిలిపింది.

ఎవడేమిటిరా ఇచ్చేది జాతీయ హోదా...?
మాతృభాష కాపాడుకోవడం మాకు రాదా...?
తరాలు మారిన, యుగాలు గడిచిన...
ఖరాఖండిగా మేం చెప్పెదోక్కటే...!
దేశ భాషలందు తెలుగు లెస్స...!!!

తెలుగు ఎప్పటికి వెలుగు

రచన:  01-01-2013                       
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

No comments:

Post a Comment