ఓ మనిషి నీ లక్ష్యమేమిటి?
ప్రవేశిస్తున్నావు
మాతృగర్భంలోకి నీకు తెలియకుండా,
బయటపడుతున్నావు
నవమాసాల తర్వాత ఉషోదయ భానుడిలా,
దాటుతున్నావ్
బాలారిష్టాలు కేరింతల మధ్య,
పెంచ బడుతున్నావ్
లౌకిక జ్ఞానమే ధ్యేయంగా,
చేసుకొంటున్నావ్
డబ్బు సంపాదనే జీవితపు లక్ష్యంగా,
జరుపుకొంటున్నావు
పెళ్ళి సంభరాలు ఆర్భాటంగా,
పుట్టిస్తున్నావు
పిల్లలను ఒక అవసరంగా,
పెంచుతున్నావు
వారిని ని మనో వాంఛ కార్య వారసులుగా,
చేరుకుంటున్నావు
అవసాన దశ సృష్టి ధర్మంగా,
పడుతున్నావు
పడలేని అగచాట్లు మలిసంధ్యలో అతిధీనంగా,
ముగిస్తున్నావు
నీ జీవన పయనాన్ని అర్థాంతరంగా, అసంతృప్తిగా,
ఇంత చేసినా ఒక
ప్రశ్నకు జవాబు మాత్రం అలాగే నీతో దోబుచులాడుతూనేవుంది...ఓ మనిషి నీ లక్ష్యమేమిటి?
No comments:
Post a Comment