Thursday, 25 September 2014

నా మొదటి పది తూటాలు...5 ) మొదలు పెడతావా ఓ గంగుల?


మొదలు పెడతావా ఓ గంగుల?
కాలచక్రపుగమనచలనములో అలుపెరుగని ఓ బాటసారి,
మనసుతో తప్ప ఆధరాలతో  మాట్లాడని ఓ బిడియపు మాటకారి,
మందహాసవదనం తో తప్ప నైరాశ్యం తో కనపడని ఓ ఆచారి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

పాఠశాల పూదోటలో,
పుస్తకాల రెక్కలు విప్పి,
పాఠాల పరిమళాలను వెదజల్లి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

విద్యార్థుల మనో ఫలకం పై,
చెదరనిపాటలు వ్రాసి,
జీవితపు బాటలు వేసి,
విజయపు బావుటా ఎగురవేసి,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?

విధ్యావినీలాకాశపు ఓ ధృవతార,
ప్రేమాభిమానురాగల విలువలుగల ఓ నయగార,
రెక్కలు ముక్కలు చేసి,
డొక్కలు చెక్కలు చేసి
పిక్కల పక్కలు వేసి,
విలువల కోటలు, గౌరవ మేడలు కట్టిన ఓ చక్రవర్తి,
గెలుపే తెలిసిన, అలుపేఎరిగని,
మనసే తెలిసిన, కాఠిన్యం ఎరుగని,
స్నేహప్రేమలే తెలిసిన, అహమే ఎరుగని,
ఓ అజాతశత్రు,
జీవితపు అగచాట్ల నుండి,
సమాజపు నగుబాట్లనుండి,
కుటుంబాన్ని గుండెలకత్తుకొని,
రిక్త పాదాలతో కాలపుముళ్ళ పై  నడిచిన ఓ మౌనముని,
పదవీ విరమణ చేస్తున్నావా ?
పదవీ విరమణ చేస్తున్నావా ఓ గంగుల?


నామట్టుకునాకు, నీకిదికాదు పూర్ణబిందువు,
ప్రయాణం మొదలైంది, నడకప్రారంభించు ఓ బంధువు,
ఆశావాహ రధచాక్రాలపై,
నికేతేలిసిన విజయసూత్రాలపై,
గడిచిన దశాబ్దాల అనుభవ సప్తవర్ణాశ్వాలపై,
విశ్వాసపు ఖడ్గంబూని, ధీమా డాలుతో,

ప్రయాణం మొదలు పెడతావ మిత్రమా?
ప్రయాణం మొదలు పెడతావ ఓ గంగుల?
(ఈ కవిత నా మిత్రుడు గంగుల శశాంక్ యొక్క తండ్రి గారైన శ్రీ గంగుల సత్యనారాయణ గారు ప్రభుత్వ హెడ్ మాస్టర్ గా తన విధులనుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వారికి పదవి విరమణ సత్కారం రోజున నేను ఉదయము వారికి ఏమి బహుమతి ఇచ్చినచో సముచితముగా నుండును అని తలంచి చివరకు అక్షర బహుమతిని ఇవ్వదలచి ఈ కవితను వ్రాసి సత్కారమహోత్సవములో చదివి వారికి బహుమతి గా ఇచ్చినాను)


రచన:  31-10-2013
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

No comments:

Post a Comment