ఓ మనిషి నీవెక్కడ?
అడగాలని వుంది, నిగ్గతీయాలని
వుంది,
అందుకే చెప్పేవారికోసం వెతుకుతున్నా!
చెప్పాలని వుంది, గుట్టు విప్పాలని
వుంది,
అందుకే అడిగేవారికోసం వెతుకుతున్నా!
సంతోషపరచాలనివుంది, రంజింపజేయాలనివుంది,
అందుకే ఆనందించేవారికోసం వెతుకుతున్నా!
వినాలనివుంది, మైమరచిపోవాలనివుంది,
అందుకే పాడే వారికోసం వెతుకుతున్న!
చూడాలనివుంది, పరవశించిపోవాలనివుంది,
అందుకే నాట్యం చేసే వారి కోసం వెతుకుతున్న!
స్పందించాలని ఉంది, స్పర్శించాలని ఉంది,
అందుకే ప్రేమించబడేవారికోసం వెతుకుతున్న!
మానవీయ విలువలు, వలువలు వదిలి నడి వీధి లో
నృత్యం చేస్తున్న వేళ,
అమేయ ప్రమేయమైన మేధోసంపత్తి గలవారు కుంచిత
భావాలతో వ్యాఖ్యానిస్తున్న వేళ,
నిజం నగ్నమై, అబద్దం అమోఘమై, క్రూరత్వం
కడుపునింపుకుంటున్న వేళ,
అశేష జనవాహిని వాహన ఎడారిలో –
ఒక నిస్వార్థ ప్రేమాభిమానపూరితమైన మనిషి కోసం వెతుకుతున్నా! ఓ మనిషి నీవెక్కడ?
రచన: 01-01-2013
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ –స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్
ల్యాబ్ – నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB-
Nizamabad
94404 76854
No comments:
Post a Comment