అన్వేషణా దౌర్భల్యం
కామ వాంఛ (శృంగార కోరిక) –
అనంతమైన అసంతృప్తి లో తృప్తి అంతాన్ని అన్వేషిస్తుంది.
ఇది శారీరక దౌర్భల్యం.
క్రోధ జీవలాలన (కాల్చేది)
– బలమైన క్షణములో బలహీనులను అన్వేషిస్తుంది.
ఇది వివేక దౌర్భల్యం.
లోభ లాలస (తీవ్ర కోరిక) –
మానవీయత అంతిమ సంస్కారములో లాభనష్టాలన్వేశిస్తుంది.
ఇది రాగ (ఆకర్షణ)
దౌర్భల్యం.
మోహ బంధురం – ప్రాపంచిక
విషయాల్లో నిత్య బుద్ధి ని (అందరు నావారు), బంధు గణములో దేహాత్మ
బుద్ధిని (అంత నిజమే, మాయలేదు) అన్వేషిస్తుంది.
ఇది ఇహ లోక (భూలోక)
దౌర్భల్యం.
మదాంధకారం (అహంకారము) –
సత్యం వెలుగులో అసత్యాన్ని, ధర్మం దివిటితో అధర్మాన్ని అన్వేషిస్తుంది.
ఇది అవిజ్జా (అజ్ఞానము)
దౌర్భల్యం.
మాత్సర్యా (ఈర్ష్య)...పరుల
అపజయములో మన జయాన్ని,మన ఉన్నతిలో ఇతరుల దుర్గతి ని అన్వేషిస్తుంది.
ఇది మానసిక దౌర్భల్యం.
సనాతన ధర్మానుసారం, ఇదే
గీతా సారం.
ఈ ఆర్షడ్వర్గ దౌర్భల్యాల
విముక్తినే మోక్ష సాధన అంటారు.
రచన: 01-08-2014
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ –స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్
ల్యాబ్ – నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB-
Nizamabad
94404 76854
No comments:
Post a Comment