Thursday 25 September 2014

నా మొదటి పది తూటాలు...11) సమయం మించిపోతోంది


సమయం మించిపోతోంది
21/11/2013
సమయం మించిపోతుంది.
తెలంగాణా వచ్చేసింది.
ఇరవై ఒకటవ శతాబ్దపు ధ్రువతార తన కిరణప్రసరణ ప్రారంభించింది.
కవితాగ్రేసరులారా కదలిరండి,
ప్రజాస్వామ్య రాక్షకులారా తరలిరండి,
మహోద్యమ ఉధ్యమకారులార ఎలుగెత్తడం చాటండి,
సృష్టికి ప్రతిసృష్టిచేయగల శాస్త్రవేత్తలార మొదలుపెట్టండి,
కార్య శూరులై, కంకణబద్ధులై, ఆరంభించండి.
నవ్యోత్క్రుష్ట్ట కలల తెలంగాణా మహాద్బుత నిర్మాణం తలపెట్టండి. ఎందుకంటే... 
సమయం మించిపోతుంది.

సమయం మించిపోతుంది.
తెలంగాణా వచ్చేసింది.
దశాబ్దాల దాస్యశృంఖలాలను త్యాగధనుల మనోబలం ఖండించి వేసింది. కావున...
విద్యాలోకపు వికసించిన పుష్పాల్లార,
తత్వజ్ఞాన విశాల సముద్ర కెరటాల్లార,
రాజనీతిజ్ఞ కదనరంగపు దురంధరులార,
జాతి, ధర్మ సంరక్షణా వీర శౌర్యులార,
ఆలోచలనలను పరిగేత్తించండి, ఆశయాలకు పదును పెట్టండి,
భవ్య జ్ఞాన తెలంగాణా మహోజ్వల దీపం వెలిగించండి ఎందుకంటే... 
సమయం మించిపోతుంది.


No comments:

Post a Comment