నేనొక దుర్గం
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
పగిలిన గుండెల, విచిలిత మనసుల,
ఓడిన మనుషుల, ముగిసిన కధనల,
కేకల పిలుపుల, ఆశల బాసల,
స్పందన నేనే, స్పందన నేనే,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
శీలము దోచిన, ప్రాణము తీసిన,
మోసము చేసిన,పాపము తలచిన,
కిరాత గుండెల రెండుగా చీల్చిన,
ఖడ్గం నేనే, ఖడ్గం నేనే
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
కులాల పేరుతో, మతాల సాకుతో,
మనుషుల మార్చి, జాతిని చీల్చే
గుంటనక్కల, గిరాటు వేసె,
ప్రజాతి నేనే, సుజాతి నేనే,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
వందల మందల, ఎదిరిన శూరుల,
ముష్కర దాడుల, ఒరిగిన వీరుల,
రక్తపు మడుగుల, తడిసిన అడుగుల,
కోపం నేనే, శోకం నేనే, బాధను నేనే, గాధను నేనే,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
బిగిసిన పిడికిలి, గుండెలో ధైర్యం,
సమస్త శాస్త్రము జయింప ధ్యేయం,
మహాత్మా హృదయము, విప్లవ శంఖం,
భారత యువత నేనే, జననికి భవిత నేనే,
నేనొక పయనం, నాదొక గమ్యం,
నేనొక శౌర్యం, నాదొక ధీరం,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
యుగాలు దొర్లిన, శకాలు గడిచిన,
రాతలు మారని, భవితలు తెలియని,
చీకటి బంధుర ధరిత్రి సంతతి
చుక్కా నేనే, దిక్కు నేనే
కిరణం నేనీ తరుణం లోనే,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
మానము దోచిన కామకోడుకుల,
గుండెలగుండా శూలము దించే,
ఝాన్సి నేనే, రుద్రమ నేనే
భగతు నేనే, బోసు నేనే
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
మాటల గోడల కోటలు కట్టి,
మోసపు బాసల బిల్లులు పెట్టి,
దేశ ప్రజలను చులకన చేసే,
నాయక గణముల కొమ్ములు కోసే,
పౌరుడ నేనే, ఓటరు నేనే,
నేనొక దుర్గం,
నేనొక ధైర్యం,
నేనొక స్థైర్యం,
నేనొక సైన్యం!
అహంభావులలో అమాయకులం,
అవినీతిపరులలో ఆత్మీయులం,
అట్టడుగువర్గాలలో అపరకుబేరులం,
సమస్త భూమండలం పై ఉత్తమ కులం,
భారత యువ “కులం”
భారత యువ “కులం”
మేమొక దుర్గం,
మేమొక ధైర్యం,
మేమొక స్థైర్యం,
మేమొక
సైన్యం!
రచన: 11-11-2013 by ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ –స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్
ల్యాబ్ – నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB-
Nizamabad - 9440476854
No comments:
Post a Comment