నిశ్శబ్ధం
ఆలోచనా ప్రవాహాల దిగ్బంధం,
ఉచ్వాస నిశ్వాస క్షణాల స్తబ్దం,
పూర్వాశ్రమ కర్మఫల
ప్రారబ్దం
ఈ నిశ్శబ్దం!
ప్రారంభానికి ముందు
వుండే ఆరంభం,
బాహ్య యుద్దానికి
ముందుండే అంతః రణరంగం,
బిన్నద్రువ మనస్తత్వాల
రాపిడి లబ్దం,
ఈ నిశ్శబ్దం!
కంటినీరు గుండెను
బరువెక్కించినప్పుడు కావాలనిపించేది,
కపటకౌగిలిలో ప్రేమకు
వూపిరి ఆడనప్పుడు శ్వాసించాలనిపించేది,
ఆత్మీయత, అవసరం కోసం
అవమానపరిచినప్పుడు ఏర్పడే అగాధం,
ఈ నిశ్శబ్దం!
ఆద్యంతములేని
బ్రమ్మాండమును కబలించియున్నది,
పశ్చ్యాతాప చింతనావస్థలో
శమంతకమై తారసపడేది,
(శ్యమంతకమని పదార్థ
స్వభావాలు మార్చగలిగే గుణం కలిగినది)
సృష్టి కి పూర్వం, స్తితి
తో పాటు, లయ తరువాత ఉండే ప్రణవం,
ఈ నిశ్శబ్దం!
జన్మించక ముందు, మరణించిన తరువాత వినబడే ఏకైక
శబ్దం...
ఈ నిశ్శబ్దం!
రచన: 11-11-2013
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ –స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్
ల్యాబ్ – నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB-
Nizamabad
94404 76854
No comments:
Post a Comment