Thursday, 25 September 2014

నా మొదటి పది తూటాలు... 7) నా యువత దిగాజారిపోతున్నది !


నా యువత దిగాజారిపోతున్నది


రుగ్మతల దిగుమతులు జరుగుచున్నాయి!
దృక్పథాల ఎగుమతులు ఎగిసిపడుతున్నాయి!
విలువల రాబడులు తగ్గి,
నైతికత సంక్షోభంలో ఉంది!
సంస్కృతి వలసవెళ్ళి,
సంప్రదాయాల్ని అనాథ చేసింది!
ఆశలు ఆవిరై, ఆశయాలు నీరుగారుచున్నాయి!
మమతలు మంటగలిసి, ఆత్మీయతలు అగాధంలోకి పడిపోయాయి!
అనుబంధాల జాడలేక , అనురాగం వెక్కి వెక్కి ఏడుస్తున్నది
ఆశావాద ఆలోచలనలను సమాధి చేసి,
నిరాశావాదం నగ్ననృత్యం చేస్తున్నది!
తార్కికం తలదాచుకోవడానికి చోటులేక అంతరించి పోతుంటే,
అనుకరణ  అనైతికతో కలిసి బారసాల జరుపుకుంటుంది!
మానవత్వం సంతలో పిల్లాడిలా ఎక్కడోతప్పిపోతే,
క్రూరత్వం కసాయితనం తో కలిసి షికార్లు కొడుతున్నది!
విద్యావినీలకశపు ధృవతారాలు ఎప్పుడో రాలిపోయాయి,
ఇపుడున్నవంతా అజ్ఞానామవాస్యపు  నిశీధి పిశాచాలు మాత్రమె!
గౌరవాన్ని ఎవరో గునపాలతో గుచ్చిగుచ్చి చంపారని విన్నాను,
కాని శీలాన్ని కూడా ఆమ్లములో ముంచిముంచి కాల్చారని తెలిసి బిక్కచచ్చాను!
జీతాలవరదల్లో జీవితాల విలువలు ఎప్పుడో కోట్టుకపోయాయి,
ఇప్పుడు చూస్తున్నది సాంకేతికత భూకంపంలో మిగిలిన స్నేహపు శిధిలాలు మాత్రమే!
ఉద్యోగాల ఉచ్చు పరిశోధనా జిజ్ఞాసను ఉక్కిరిబిక్కిరీ చేస్తుంటే,
పరదేశి వ్యామోహాలు  జాతీయతను నక్కినక్కి వేక్కిరిస్తున్నాయి!
క్లబ్బులుపబ్బులను  గుడిగోపురాలుగామార్చుకొని,
మత్తుపథార్థపానియలే తీర్థప్రసాదాలుగా సేవిస్తున్నారు!
సమాజాహితవు ఛాతిపై స్వార్థం స్వారిచేస్తుంటే,
మతతత్వం కులపెత్తనం కలసి వ్యవస్థను కకావికలం చేస్తున్నాయి!
విందులు వినోదాలు  పక్కదారిపట్టి, అర్తనగ్నత్వమే సాంప్రదాయ సూచికలుగామారితే,
పండగల పెటాకులమీద పాశ్చాత్య వగలాడి జుగుప్సాకరంగా హొయలు పోతొంది!
ఎవరితో చెప్పుకోను నా బాధ, ఇంకెవరితో పంచుకోను నా వ్యధ?
రవిఅస్తమించని సామ్రాజ్యాల పీచామనచగలిగాము,
కాని రవి కాంచని ఆర్షడ్వర్గాలను జయించలేకున్నాము!



మహాత్ముడి బోధనలు మరియు వివేకుడి సూక్తులను వల్లెవేస్తాము,
కాని నాయకత్వ లక్షణాలు, నాగరికత ఆనవాళ్ళు మచ్చుకైనా అలవర్చుకోము!
స్వామిజీ 150 వ జయంతి జరుపుకోనుచున్నాము,
గాంధీజీ 65 వ వర్ధంతి స్పురణకు తెచ్చుకోనుచున్నాము,
కాని ఏమి లాభం,
సిలువలపై వ్రేలాడుచున్నాయి వారి కలలు,
వధశిలలపై తెగి పడ్డాయి వారి ఆశయాలు
ఎందుకంటే
ఎదిక్కుచుసినా, ఏనోటవిన్నా ఒకేమాట...
నా యువత దిగాజారిపోతున్నది !

రచన:  11-11-2013
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

No comments:

Post a Comment