Thursday, 25 September 2014

నా మొదటి పది తూటాలు...1) దేవతకు వందనం


దేవతకు వందనం          
ఆడది అంగడి సరుకా?
కొంత మగ జాతిని నరక!
ఎవడికేం ఎరుక
బిడ్డ కోసం ఆడది పడ్డ మరక?
ఆడదీ లేకుంటే
నీవెంత మగాడివో నీకేం ఎరుక?

ఆడది ఆట బొమ్మా?
కొంత మగ జాతిని తెగనమ్మ!
ఎవడికి లేదురా
ఇంటిలోపలబయట అక్క, చెల్లి, అమ్మా?
ఆడదేమైన నీకు-
దేవుడిచ్చిన శృంగారపు బొమ్మా?
నిన్ను తెగనమ్మ!!

ఆడది శయణేషు రంభా?
కొంత మగజాతిది రేగాలి పంబ!
కార్యేషుదాసీ, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత,
క్షమయా ధరిత్రి! రాదా గుర్తుకు  సావిత్రి?
మాత్రమే కావలా రంభ?
కొందరిది రేగాలి పంబ!
అందరిచే కావ్యలల్లిస్తూ, చిత్రాలు వేయిస్తూ, పాటలుపాడిస్తూ-
మమ్ముల్ని లాలిస్తూ, మురిపిస్తూ, గౌరవిస్తూ, సుఖపెడ్తూ-
నీవు చస్తూ, మా అందరికీ జన్మనిస్తున్న-
ప్రేమానురాగాత్మియతామూర్తి, శృంగారానికే ఘనకీర్తి స్త్రీ
నీకు, అందరి మగాళ్ళ తరపున ఇదే నా వందనం.
రచన:  01-01-2013                       
ప్రవీణ్ తాడూరి – PRA“WIN” TADURI
చైర్మన్ స్కూల్- బిబిసి హై- ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజామాబాద్
Chairman - School – BBC HIGH- OXFOD ENGLISH LAB- Nizamabad
94404 76854

No comments:

Post a Comment